Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ‘డీప్‌సీక్‌‌’పై సైబర్ దాడి జరిగినా.. అలాగే అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా మన మార్కెట్ గ్రీన్‌లో కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 535 పాయింట్లు లాభపడి 75, 901 దగ్గర ముగియగా.. నిఫ్టీ 128 పాయింట్లు లాభపడి 22, 957 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 20 పైసలు తగ్గి 86.53 దగ్గర ముగిసింది.

నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ప్రధానంగా లాభపడగా.. సన్ ఫార్మా, బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందాల్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.7 శాతం పడిపోయింది. సెక్టార్లలో ఆటో, బ్యాంక్, రియల్టీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరగగా, క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ, హెల్త్‌కేర్ మరియు ఐటి 0.5-1 శాతం క్షీణించాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top