
బస్సులు, రైళ్లు అయిపోయాయి.. విమానంలో మొదలెట్టేసారుగా ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రయతనం చేస్తన్నారు. దానికి ఏదైనా చేయడానికి వెనుకాడడం లేదు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్నది పట్టించుకోకుండా తమకు ఆసక్తి ఉన్న విషయాల్లో విభిన్నమైన పనులు చేస్తూ పాపులారిటీ సంపాదించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వ్యక్తి విమానంలో చేసిన పని చూస్తే “ఇదేం డ్యాన్స్?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా రైళ్లు, మెట్రోలు వంటి ప్రదేశాల్లో వీడియోలు, రీల్స్ చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ కొత్త స్థాయికి చేరుకుంది. విమానంలో ప్రయాణీకులతో నిండిన సమయంలో ఒక వ్యక్తి తన దారుణమైన డ్యాన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
వీడియోలో ప్రయాణికులతో నిండిన విమానంలో, ఒక వ్యక్తి సడెన్‌గా లేచి ఆనందంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. అతని చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యంతో అతనిని చూస్తున్నారు. కొంతమంది సిగ్గుపడుతుండగా, మరికొందరు వ్యక్తి పనితీరును చూస్తూ ఇబ్బందిగా భావించారు. విమానంలో అందరూ కూర్చుని ఉన్నా, ఆ వ్యక్తి తను డ్యాన్స్ చేస్తుండటం అందరికీ షాక్ గురి చేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా వ్యూస్ రాగా. నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
బస్సులు, రైళ్లు అయిపోయాయి.. విమానంలో మొదలెట్టేసారు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరేమో.. విమానంలో ఇలాంటి పనులు చేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోతో వినోదం, ప్రసిద్ధి కోసం వ్యక్తులు ఎంతవరకు వెళ్తారనే ప్రశ్నలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఇలా చేస్తే ఇతర ప్రయాణికుల భావాలను గౌరవించాలనే అంశం కూడా నెటిజన్లలో చర్చకు దారి తీస్తోంది.
READ MORE……