Jio Recharge Offer: త్వరపడండి.. 200 రోజులకు 500GB డేటా

Jio Recharge Offer: రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త సంవత్సరం సందర్భంగా బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో కంపెనీ ప్రత్యేకంగా రూ.2025 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 200 రోజుల వ్యాలిడిటీతో పాటు 500GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 31, 2025తో ఈ ప్రత్యేక ప్లాన్ ముగుస్తుంది. ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆఫర్.

ఇక రూ.2025 ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 200 రోజులు కాగా.. 5G వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది. ఇక 4G యూజర్లకు రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 200 రోజుల్లో మొత్తం 500GB డేటా వస్తుంది. ఇక ఈ ప్లాన్ లో వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు పంపించుకోవచ్చు కూడా .

ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే.. జియో సినిమా (ప్రీమియం కంటెంట్ మినహా), జియో టీవీ, జియో క్లౌడ్, రూ.2,150 విలువైన కూపన్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు జియో అదనంగా కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్ కూపన్లను కూడా అందిస్తోంది. ఇందులో ప్రధానంగా రూ.500 Ajio కూపన్ (రూ.2,500 లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్‌పై వర్తింపు), రూ.150 స్విగ్గీ డిస్కౌంట్ (రూ.499 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై), రూ.1,500 విమాన టిక్కెట్ తగ్గింపు (ఈజ్‌మైట్రిప్ ద్వారా బుకింగ్‌లపై) లభిస్తాయి.

ఈ ప్రత్యేక ఆఫర్ చాలా తక్కువ కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి వినియోగదారులు జనవరి 31, 2025లోపు రీఛార్జ్ చేసుకోవాలి. ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరోవైపు జియో తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. అత్యంత ప్రజాదరణ పొందిన రెండు ప్లాన్‌లను కంపెనీ తొలగించింది. రూ.189 ప్లాన్, రూ.479 ప్లాన్ లను నిలిపి వేసింది. జియో వినియోగదారులకు 2025 న్యూ ఇయర్ స్పెషల్‌గా భారీ ఆఫర్‌ను అందించడంతో పాటు కొన్ని ప్లాన్‌లను తొలగించడం మిశ్రమ స్పందనను తెచ్చింది. కొత్త ప్లాన్‌తో ఎక్కువ డేటా, ఎక్కువ కాలం ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ చిన్న మొత్తంలో ప్లాన్‌లను ఉపయోగించే వారికి ఇది కొంత అసంతృప్తిని కలిగించవచ్చు.

Read More…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top