Bumper Offer: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత సొంతం!

Bumper Offer: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత సొంతం!

Bumper Offer: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత సొంతం! చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ మరోసారి తన ఉద్యోగులకు అద్భుతమైన బోనస్ ఆఫర్ ప్రకటించింది. తమ కంపెనీ ఉద్యోగులకు మొత్తంగా రూ.70 కోట్లు వార్షిక బోనస్‌గా అందజేసింది. అయితే, ఈ బోనస్‌ను ఇచ్చే విధానం చాలా ఆసక్తికరంగా నిర్వహించింది కంపెనీ యాజమాన్యం. ఇందుకోసం కాస్త భారీగానే ఏర్పాట్లు కూడా చేసారు.

Also Read: BSNL: వినియోగదారులకు షాక్.. సూపర్ ప్లాన్స్‭ను తర్వలో నిలిపేయనున్న బిఎస్‭ఎన్‭ఎల్

ఇక ఈ మొత్తాన్ని పంపకం ఎలా నిర్వహించారన్న విషయానికి వస్తే.. బోనస్ మొత్తం సొమ్మును 60 నుంచి 70 మీటర్ల పొడవైన టేబుల్‌పై ఉంచారు. ఆపై ఉద్యోగులను 30 టీమ్స్ గా విభజించారు. ఆ తర్వాత ఒక్కో టీమ్ నుంచి ఇద్దరిని ఎంపిక చేసి వారికి 15 నిమిషాల సమయం ఇచ్చారు. 15 నిమిషాల్లో ఎంత మొత్తాన్ని లెక్కపెడతారో.. అంత మొత్తం ఆ టీమ్‌కు ఇచ్చే విధంగా రూల్స్ ను అనుసరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కట్టలుగా ఉన్న నోట్లను ఉద్యోగులు లెక్కపెడుతూ కనిపించటం మనం చూడవచ్చు.

అయితే ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. హెనన్ మైన్ క్రేన్ సంస్థ గతంలో కూడా 2023 జనవరిలో ఇదే విధంగా రూ.70 కోట్ల బోనస్ తన ఉద్యోగులకు ఇచ్చింది. ఇది కంపెనీ ఉద్యోగుల కృషిని గుర్తించి వారిని మరింత ప్రోత్సహించే విధంగా మంచి ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ విధమైన బోనస్ పథకాలు ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా, కంపెనీ సానుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఒకవేళ ఇదే అవకాశం మీకు వస్తే.. 15 నిమిషాల్లో ఎంత లెక్కపెట్టగలరో ఓ కామెంట్ చేయండి.

Read More…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top