- Post Office Savings Account: తక్కువ పెట్టుబడితో అధిక వడ్డీ రేట్లు పొందే ఉత్తమ ఆప్షన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్
- అధిక వడ్డీ రేట్లు పొందేందుకు ఉత్తమ ఆప్షన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్.
- పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌పై 4% వార్షిక వడ్డీ రేటు.
- ఇది ప్రధాన బ్యాంకులతో పోలిస్తే కాస్త ఎక్కువ.

Post Office Savings Account: తక్కువ పెట్టుబడితో ఎక్కువ వడ్డీ రేట్లు పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మంచి ఆప్షన్. ఈ అకౌంట్ సేవింగ్స్ (savings) పరంగా మాత్రమే కాకుండా, బ్యాంకింగ్ ద్వారా మొత్తం పెట్టుబడి పెట్టినప్పుడు మీరు ఎక్కువ వడ్డీ పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో, సేవింగ్స్ అకౌంట్ ప్రతి వ్యక్తికి అవసరమైపోయింది. బ్యాంకింగ్ సేవల నుండి ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవడానికి, అనేక పనులు నిర్వహణకు సేవింగ్స్ అకౌంట్ లేకుండా పూర్తి కావు. కాబట్టి కేవలం బ్యాంక్స్ లో మాత్రమే కాకుండా పోస్ట్ ఆఫీస్ లో కూడా అకౌంట్ తెరవడం చాలా అవసరం.
ఇకపోతే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ను తెరవడానికి కేవలం రూ. 500 చాలు. ఇది కనీస బ్యాలెన్స్. ఈ అకౌంట్‌తో చెక్‌బుక్, ATM కార్డు, ఈ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఆధార్ లింకింగ్ ద్వారా ప్రభుత్వ పథకాల లాభం కూడా పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌పై 4% వార్షిక వడ్డీ రేటు ఇవ్వబడుతుంది. ఇది ప్రధాన బ్యాంకులతో పోలిస్తే కాస్త ఎక్కువ. ఈ రేటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులలో అందించే వడ్డీ రేట్లకంటే ఎక్కవే.
భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించడానికి వేర్వేరు కనీస బ్యాలెన్స్ లిమిట్ లను ఉంచినవి. ప్రభుత్వ బ్యాంకుల్లో అకౌంట్ ప్రారంభించడానికి రూ. 1,000 నుండి 3,000 వరకు అవసరం. అదే ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ మొత్తం రూ. 5,000 నుండి 10,000 వరకు ఉండవచ్చు. దీనితో పాటు, ప్రభుత్వ బ్యాంకుల్లో వడ్డీ రేటు 2.7% కాగా, ప్రైవేట్ బ్యాంకుల్లో 3% నుండి 3.5% వరకు మాత్రమే ఉంటుంది. ఇది పోస్ట్ ఆఫీస్ రేట్ల కంటే తక్కువ. అంతేకాదండోయ్.. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో సంపాదించిన వడ్డీపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80TTA క్రింద రూ.10,000 వరకు పన్ను మినహాయింపు అందుతుంది. అలాగే, ఇది ప్రభుత్వం నిర్వహించే ఒక ఖాతా కావడంతో ఇది చాలా సురక్షితమైన, నమ్మదగిన ఆప్షన్. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ను ఏ వ్యక్తి అయినా తెరవవచ్చు. ఇద్దరు వ్యక్తులు కలసి కూడా ఒక జాయింట్ అకౌంట్ కూడా తెరవవచ్చు.