- Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగులు.. ఫేక్ ఐడీ కార్డు చూపి..!
- ఫేక్ ఐడీ కార్డుతో ఘరానా మోసాలు
- పూర్తి ఆధారాలతో పట్టుకున్న సెక్రటేరియట్ సీఎస్ఓ

తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగుల వ్యవహారం బయటపడింది. నకిలీ ఉద్యోగుల కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పూర్తి ఆధారాలు సేకరించి.. చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఎస్పీఎఫ్కు నకిలీ ఉద్యోగులు పట్టుబడ్డారు.
ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్నాడు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి, భాస్కర్ రావు కలిసి ఫేక్ ఐడీ కార్డు తయారు చేసుకున్నారు. సెక్రటేరియట్లో కీలక మంత్రుల పేర్లు చెప్పి.. పనులు చేయిస్తామని, ఫైల్స్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు. వీరి కదలికలపై సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్‌కు అనుమానం వచ్చింది. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులుకు విషయం చెప్పిన దేవిదాస్.. రవి, భాస్కర్ రావులపై ఓ కన్నేయమని ఆదేశించారు.
యూసుఫ్, ఆంజనేయులు కొన్నిరోజులుగా నిఘా పెట్టి.. రవి, భాస్కర్ రావులు ఫేక్ ఐడీ కార్డు తయారు చేసినట్లు గుర్తించారు. పూర్తి ఆధారాలు సేకరించి చాకచక్యంగా ఇద్దరినీ పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటివరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు?, ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా?, సెక్రటేరియట్లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంది?, వీరికి ఎవరు సహకరించారు?, వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ ఉద్యోగులు పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ1గా భాస్కర్ రావు, ఏ2గా డ్రైవర్ రవి ఉన్నారు.
Osmania Hospital: వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ఉస్మా’నయా’ హాస్పిటల్
- కోసం 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్
- ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు
- రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్
- సెక్రటేరియెలో మంత్రి దామోదర రివ్యూ మీటింగ్

వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ‘ఉస్మానియా ఆసుపత్రి’ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. కోట్ల మంది ప్రజల కోసం 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మాణం కాబోతోంది. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు.. రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ.. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ.. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు.. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు.. ఇలా ఇంకా ఎన్నో అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కొత్త ఉస్మానియా హాస్పిటల్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. హాస్పిటల్ నిర్మాణంపై అధికారులతో బుధవారం సెక్రటేరియెలో మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ… ఉస్మానియా ఆసుపత్రికి పునర్వైభవాన్ని తీసుకొస్తాం. 26.30 ఎకరాల విస్తీర్ణంలో 32 లక్షల స్క్వేర్ ఫీట్ సామర్థ్యంతో హాస్పిటల్ భవనాలు ఉంటాయి. హాస్పిటల్లో మొత్తం 2 వేల పడకలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 22 డిపార్ట్మెంట్లు ఉండగా.. అదనంగా మరో 8 డిపార్ట్మెంట్లు కొత్త ఉస్మానియాలో ప్రారంభిస్తాం. పేషెంట్ల సౌకర్యార్థం అన్ని రకాల డయాగ్నస్టిక్ సేవలను ఒకేచోట అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లో ఓపీ సేవలు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌తో కూడిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూ వార్డులు అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పారు.
స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు ఉంటాయని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా డిజైన్లు చేయాలని అధికారులకు సూచించామన్నారు. రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు, అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు, పేషెంట్ అండ్ అటెండెంట్ల కోసం ఆస్పత్రి ఆవరణలోనే ధర్మశాల, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్ ఉంటాయని తెలిపారు. ఉన్న 38 ఎకరాల స్థలంలో 26.30 ఎకరాలను హాస్పిటల్ కోసం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్, గోషామహల్ ప్రజలకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్ నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని అధికారులకు మంత్రి ఆదేశించారు.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు!
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
- కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఆగంతకుడు
- ఫేక్ అని ధ్రువీకరించిన ఎయిర్పోర్ట్ అధికారులు

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. అప్రమత్తమై ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేశారు. ఎక్కడా ఏమీ లభ్యం కాలేదు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని భద్రతా సిబ్బంది తేల్చింది. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ధ్రువీకరించారు.
బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. నిందితుడికి మతిస్థిమితం సరిగా లేదని తేల్చారు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేలడంతో ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటికే ఇలాంటి ఫేక్ కాల్స్ ఎన్నో వచ్చిన విషయం తెలిసిందే.
Sridhar Babu: గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్ఎంఈ పరిశ్రమల్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం!

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లామని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయని, తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి మంత్రి ధన్యవాదాలు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి రూ.1.73 లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడులు తీసుకొచ్చారు.
నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘పరిశ్రమలు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటన చేశాం. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి ధన్యవాదాలు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గతేడాది తెలంగాణలో మొదటి సారి ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చాం. దేశంలోని ఈ పాలసీ ప్రొడక్టివిటీ ఉన్న పాలసీగా పేరొందింది. రైతులకి ఉపయోగపడే విధంగా ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్ఎంఈ పరిశ్రమల్ని ఏర్పాటు చేయడం మా లక్ష్యం. ఇలాంటి ఎన్నో లక్ష్యాలతో దావోస్ పర్యటన విజయవంతంగా జరిగింది’ అని చెప్పారు.
‘షుగర్ ఫ్యాక్టరీల పున:ప్రారంభం త్వరలోనే జరుగుతాయి. 2025 డిసెంబర్ లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు చేస్తున్నాం. ఒక నెల ముందే పున:ప్రారంభం చేయాలనే ఆలోచన ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో షుగర్ ఫ్యాక్టరీలను రీ ఓపెన్ చేస్తాం. తక్కువ పెట్టుబడితో డీప్ సీక్ లాంటి ప్రాడక్ట్ తీసుకురావొచ్చు. మనదేశంలోని మేధశక్తితో డీప్ సీక్ లాంటి ప్రాడక్ట్ ప్రోత్సాహం అందిస్తాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయనని పార్టీకి చెప్పారు. అందుకే ఇతర అభ్యర్ధుల దరఖాస్తుల పరిశీలన చేశాం. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థి ఎవరనేది ఖరారు అవుతుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇండ్లు ఉన్నవాళ్లు దరఖాస్తు చేస్తే నిరాశ ఎదురవుతుంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం’ అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.