- Minister Seethakka : ప్రతి మనిషికి 100 లీటర్ల నీరు.. ప్రతిరోజు అందించాల్సిందే
- గాలి తర్వాత నీరే మనుషులు కావాలి
- కోట్ల మందికి నీరందించే అదృష్టం మనకే దక్కింది
- ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించాల్సిందే : మంత్రి సీతక్క

Minister Seethakka : వచ్చే ఐదు నెలల కోసం మిషన్ భగీరథ సిబ్బంది ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు మంత్రి సీతక్క. వేసవి ముగిసే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె వ్యాఖ్యానించారు. గాలి తర్వాత నీరే మనుషులు కావాలన్నారు. కోట్ల మందికి నీరందించే అదృష్టం మనకే దక్కిందని, ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించాల్సిందే అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో మండల స్థాయిలో క్రీమ్ కమిటీ వేసుకోండని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతోపాటు, మిషన్ భగీరథ నీళ్లపై నమ్మకం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టండన్నారు మంత్రి సీతక్క. మిషన్ భగీరథ పై వేల కోట్లు ఖర్చు చేసినా.. ప్రజలు ఎందుకు ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదో అధ్యయనం చేయాలన్నారు. ఎంతమంది మిషన్ భగీరథ నీరు తాగునీటి కోసం వినియోగించడం లేదో సర్వేలు చేపట్టండని ఆమె అన్నారు.
అంతేకాకుండా..’అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మేర మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేస్తున్నాము? ఎన్ని గృహాలకు నీరు అందటం లేదు వంటి వివరాలను ఎమ్మెల్యేలకు అందజేయండి.. మిషన్ భగీరథ నీళ్లు వాడేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టండి.. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించండి… ప్రతి ప్రాణం ముఖ్యమైనది.. మిషన్ భగీరథ నీటి కారణంగా ఎవరు అనారోగ్యం పాలు కాకూడదు.. ఆ బాధ్యత మిషన్ భగీరథ ఇంజనీర్లది.. అడవులలో తిరిగినప్పుడు నేను అన్ని రకాల నీళ్లు తాగాను, అయినా నాకు ఏమి కాలేదు.. కానీ ఇప్పుడు ప్రజలు ఆర్వో ప్లాంట్లకు అలవాటై సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.. అధికారులంతా నిబద్ధతతో పని చేయాలి.. కావాలని తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తాం.. ఆదివాసీ మహిళగా నాకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది.. తెలంగాణ చరిత్రలోనే కాదు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఈ మహిళకు ఇటువంటి అవకాశం దక్కలేదు.. ప్రతి నిమిషం ప్రజాసేవ కోసం అంకితమవుతున్న.. నా పేరు మీద పెట్టేలా, శాఖకు వన్నెతెచ్చేలా అధికారులు అంతా పనిచేయాలి’ అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
Video Viral: క్లాస్ రూంలోనే ప్రొఫెసర్ ను పెళ్లాడిన స్టూడెంట్.. కట్ చేస్తే
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
- పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో ఊహించని ఘటన
- క్లాస్రూమ్ లోనే పెళ్లి చేసుకున్న విద్యార్థి, ప్రొఫెసర్.

Video Viral: పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీలోని అప్లైడ్ సైకాలజీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఏకంగా తన ప్రొఫెసర్‌నే పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. వీరిద్దరూ క్లాస్రూమ్ లోనే పూలదండలు మార్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రేండింగ్ అవుతోంది.
ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు ఎం జరుగుతుందో అర్థంకాక అలా ఉండిపోయారు. విద్యార్థి తన ప్రొఫెసర్‌కు సింధూరం పెడుతుండగా క్లాస్‌లో ఉన్నవారంతా అలా చూస్తూనే ఉండిపోయారు. అంతేకాదు ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్లుగా ముగ్గురు సాక్షుల సంతకాలు ఉన్న ఓ పత్రం బయటకు వచ్చింది. ఆ పత్రంలో విద్యార్థి, ప్రొఫెసర్ తమను భార్యాభర్తలుగా ప్రకటించుకున్నట్లు ఉందని సమాచారం.
అయితే, ఈ వ్యవహారంపై ప్రొఫెసర్ స్పందిస్తూ ఇది నిజమైన పెళ్లి కాదని, అకడమిక్ ప్రాజెక్ట్‌లో భాగమని తెలిపారు. అయితే, ఆ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం ఏమిటనే దానిపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం సీరియస్‌గా స్పందించింది. ప్రొఫెసర్‌ను తక్షణమే సెలవుపై పంపించి ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అసలు క్లాస్‌రూమ్‌లో ఏమి జరిగిందన్న విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులతో ప్రొఫెసర్ ఇలాంటి పనులు చేయడం యూనివర్సిటీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై యూనివర్సిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రొఫెసర్ తన వాదనలో ఎంతవరకు నిలబడతారు? విద్యార్థిపై చర్యలు ఉంటాయా? అన్నది ముందుముందు తెలియాల్సిన విషయమే. ఇది ఇలా ఉండగా ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలశ్యం వీడియో చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.
Sridhar Babu: గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్ఎంఈ పరిశ్రమల్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం!
- ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ వెళ్ళాము
- త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీల పున:ప్రారంభం
- ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లామని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయని, తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి మంత్రి ధన్యవాదాలు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి రూ.1.73 లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడులు తీసుకొచ్చారు.
నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘పరిశ్రమలు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటన చేశాం. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి ధన్యవాదాలు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గతేడాది తెలంగాణలో మొదటి సారి ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చాం. దేశంలోని ఈ పాలసీ ప్రొడక్టివిటీ ఉన్న పాలసీగా పేరొందింది. రైతులకి ఉపయోగపడే విధంగా ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్ఎంఈ పరిశ్రమల్ని ఏర్పాటు చేయడం మా లక్ష్యం. ఇలాంటి ఎన్నో లక్ష్యాలతో దావోస్ పర్యటన విజయవంతంగా జరిగింది’ అని చెప్పారు.
‘షుగర్ ఫ్యాక్టరీల పున:ప్రారంభం త్వరలోనే జరుగుతాయి. 2025 డిసెంబర్ లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు చేస్తున్నాం. ఒక నెల ముందే పున:ప్రారంభం చేయాలనే ఆలోచన ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో షుగర్ ఫ్యాక్టరీలను రీ ఓపెన్ చేస్తాం. తక్కువ పెట్టుబడితో డీప్ సీక్ లాంటి ప్రాడక్ట్ తీసుకురావొచ్చు. మనదేశంలోని మేధశక్తితో డీప్ సీక్ లాంటి ప్రాడక్ట్ ప్రోత్సాహం అందిస్తాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయనని పార్టీకి చెప్పారు. అందుకే ఇతర అభ్యర్ధుల దరఖాస్తుల పరిశీలన చేశాం. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థి ఎవరనేది ఖరారు అవుతుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇండ్లు ఉన్నవాళ్లు దరఖాస్తు చేస్తే నిరాశ ఎదురవుతుంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం’ అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.