- Betting Apps : influencer జర పైలం ఇక జైలుకే అంటున్న ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
- ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేయడంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ట్వీట్
- సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది
- వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం నేరం. : వీసీ సజ్జనార్

Betting Apps : influencer జర పైలం ఇక జైలుకే Betting Apps : నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఉప్పెనలా పెరిగిపోతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇన్‌ఫ్లుఎన్సర్లు వీటిని తెగ ప్రమోట్ చేస్తూ, అమాయక ప్రజలను మోసపూరితంగా ఆకర్షిస్తున్నారు. అయితే, ఇలాంటి యాప్స్‌ను ప్రచారం చేయడం భారతదేశ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై ఎంతో మంది తమ సంపదను కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోతున్నారు. కుటుంబ పోషణ కష్టమవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి, విడాకులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి , పేద కుటుంబాలకు బెట్టింగ్ మహమ్మారిలా మారింది.
భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నవారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అప్పుల బాధ భరించలేక, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవలే దేశవ్యాప్తంగా అనేక మంది యువకులు, ఉద్యోగులు బెట్టింగ్ వల్ల తమ ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు వెలుగుచూశాయి. భారతదేశంలో బెట్టింగ్ ప్రధానంగా చట్ట విరుద్ధమైనదే. ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేయడం లేదా వీటిలో ఆడించడం జైలుశిక్ష , భారీ జరిమానాలకు దారి తీస్తుంది. ఇటీవల, పలు రాష్ట్రాలు బెట్టింగ్ యాప్స్‌పై నిషేధాన్ని విధించాయి.
అయితే.. ఈ విషయంపై తాజా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, యువతను ఆన్‌లైన్ పందాలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం నేరమని హెచ్చరించిందని ఆయన పేర్కొన్నారు. అయినా కొంత మంది ఇన్‌ప్లూయెన్సర్లు తమ స్వలాభం కోసం ఇష్టారీతిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారని, గుర్తుపెట్టుకోండి మీరంతా శిక్షార్హులే అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. మాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. మేం ఏం చేసిన నడుస్తుందని అనుకుంటే పొరపాటే అని, సమాజ శ్రేమస్సును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం ఆపండని హితవు పలికారు. స్వార్థానికి పోయి అమాయకుల ప్రాణాలకు బాధ్యులు కాకండని ఆయన తెలిపారు.
ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్
Betting Apps : influencer జర పైలం ఇక జైలుకే TGSRTC MD Sajjanar Fire On Social Media Influencers : సామాజిక మాధ్యమాల్లో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వత్తాసు పలుకుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చేస్తూ వేలు, లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకొని, డబ్బులకు కక్కుర్తిపడి విదేశీ బెట్టింగ్, ఆన్‌లైన్ పందేలు తదితర యాప్‌లకు ప్రచారం చేస్తూ యువతను తప్పుదోవపట్టిస్తున్నారు. రాష్ట్రంలో వీటిపై నిషేధమున్నా అవేవీ పట్టనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచార మోజులో పడి గ్యాంబ్లింగ్‌కు అలవాటై వేలాది మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఏం చేసిన నడుస్తుందని అనుకుంటే పొరపాటు :
Betting Apps : influencer జర పైలం ఇక జైలుకే.. విదేశీ ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్ంగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే హెచ్చరిక చేసింది. మీ ఇన్ప్లూయెన్స్తో అమాయకుల జీవితాలు బలి చేయవద్దని సూచించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరించారు. అయినా కొంత మంది ఇన్‌ప్లూయెన్సర్లు తమ స్వలాభం కోసం ఇష్టారీతిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని వివరించారు. గుర్తు పెట్టుకోండి మీరంతా శిక్షార్హులు అని తెలియజేశారు.