Gold Rates: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఏకంగా రూ….

  • Gold Rates: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఏకంగా రూ….
  • తులంపై ఏకంగా రూ. 1050 పెరిగిన పసిడి ధర
  • నేడు కిలో వెండిపై ఏకంగా రూ. 1000 తగ్గింది
Gold Rates: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఏకంగా రూ....

హమ్మయ్య బంగారం ధరలు తగ్గాయి అని అనుకునే లోపే మళ్లీ షాకిచ్చాయి. ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోతున్నాయి. పసిడి ప్రియులకు ఊహించని షాకిస్తున్నాయి గోల్డ్ ధరలు. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. వంద, రెండు వందలు కాదు ఏకంగా తులం బంగారంపై రూ. 1050 పెరిగింది. ఒక్కరోజులోనే రూ. వెయ్యికి పైగా ధర పెరగడంతో గోల్డ్ లవర్స్ ఉసూరుమంటున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,810, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,520 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై ధర రూ. 1050 పెరగడంతో రూ. 78,100 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1150 పెరిగడంతో రూ. 85,200 వద్ద అమ్ముడవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,100 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 85,200 వద్దకు చేరింది. హస్తినలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78250 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85350 వద్ద అమ్ముడవుతోంది.

బంగారం ధరలు పరుగులు పెడుతుండగా వెండి ధరలు మాత్రం తగ్గాయి. నేడు కిలో వెండిపై ఏకంగా రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ లో వెండి ధర గ్రాము రూ. 106, కిలో రూ. 1,06,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. వెయ్యి తగ్గడంతో రూ. 98500 వద్ద అమ్ముడవుతోంది.

Telangana: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు లైవ్‌ అప్‌డేట్స్‌..

  • తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు..
  • బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణపై కీలక చర్చ..
  • సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ సమావేశం..
  • అసెంబ్లీలో బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చలు..

Telangana Assembly Special Telangana Assembly Special Session Live Updates – NTV Telugu తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహిస్తోంది.. బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో చర్చించారు.. ఆ తర్వాత ఈ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చించేందుకు సిద్ధమయ్యారు.. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వైపు అడుగులు వేస్తోన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో, రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. అందుకే ప్రత్యక సమావేశాలు ఏర్పాటు చేసింది..

  • 04 Feb 2025 11:17 AM (IST)సభ సంప్రదాయాలను తుంగలో తొక్కారుతెలంగాణ శాసనసభ చరిత్రలో ఎన్నడూ లేనిది ఇప్పుడు జరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటికీ బిజినెస్ ప్రారంభం కాకుండానే వాయిదా వేయడం ఎంతో ఘోరమైన ఘటనగా అభివర్ణించారు. ఈ నిర్ణయాల వల్ల ఎమ్మెల్యేల పరువు పోయిందని, అసెంబ్లీ సంప్రదాయాలను తుంగలో తొక్కారని అన్నారు. ఇది తెలంగాణ శాసనసభ పరువు తీశారని తీవ్రంగా స్పందించారు.
  • 04 Feb 2025 11:10 AM (IST)సభ ప్రారంభంలోనే వాయిదాతెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
  • Read More…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top