- Blackmailer: పర్సనల్ వీడియోలు ఉన్నాయంటూ రూ.2.53 కోట్లు కాజేత.. నిందుతుడి అరెస్ట్సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఓ బ్లాక్ మైలర్ బెదిరింపులు.
- న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ బెదిరింపులు
- విడతలవారీగా రూ.2.53 కోట్లను కాజేసిన నిందితుడు.

న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ బెదిరింపులు
విడతలవారీగా రూ.2.53 కోట్లను కాజేసిన నిందితుడు
Blackmailer: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు అదే టెక్నాలజీ ఉపయోగించి అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల వల్ల అనేకమంది అమాయక ప్రజలు ఇబ్బందులు పడి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరికొందరు వారి బాధను భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా చాలా ఉన్నాయి. ఇకపోతే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఓ బ్లాక్ మైలర్ బెదిరించి ఏకంగా రూ.2.53 కోట్ల డబ్బులను వసూలు చేశాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Read Also: MLC Sipai Subramanyam: వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్..! వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ సిపాయి..
మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి తన చిన్ననాటి స్నేహితురాలు భర్తగా పరిచయం అయ్యాడు సాయికుమార్. ఆ తర్వాత సాయికుమార్ వేర్వేరు ఫోన్ నెంబర్ నుండి ఫోన్ చేస్తూ తన వద్ద ఆ మహిళా ఉద్యోగీకి సంబంధించిన న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ బెదిరింపులు చేశాడు. దీంతో అతడు చెప్పినట్లుగా వినాలని నిందితుడు మహిళను బెదిరించాడు. ఈ నేపథ్యంలో విడతల వారీగా మహిళల నుంచి ఏకంగా రూ.2.53 కోట్లను కాజేసాడు నిందితుడు. దీంతో నిందితుడు నినావత్ దేవా నాయక్ అలియాస్ సాయికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ చేసిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకిని కనుగొన్నారు. మొత్తానికి నిందితుడిని నిడదవోలులో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ తర్వాత అతడి నుంచి కోటి 81 లక్షల నగదును మరిన్ని స్థిర, చర ఆస్తులను సీజ్ చేశారు
MLC Sipai Subramanyam: వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్..! వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ సిపాయి..
- కాసేపట్లో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక..
- వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్ అంటూ పుకార్లు..
- కిడ్నాప్ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ..
- నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల..

MLC Sipai Subramanyam: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌నకు గురయ్యారనే పుకార్లు షికారు చేశాయి.. అయితే, కిడ్నాప్ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ.. క్లారిటీ ఇచ్చారు.. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు.. అనారోగ్యంగా కారణంగా.. ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు.. ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను.. వైద్యులు డిశ్చార్జ్ చేయగానే వస్తాను.. అయితే, నా ఆరోగ్యం గురించి గానీ, నేను కిడ్నాప్‌నకు గురయ్యాననే వార్తలపై గానీ, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని.. ప్రజలు, అధికారులు, మీడియాకు విడుదల చేసిన ఆ వీడియోలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం..
కాగా, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతూనే ఉంది.. షెడ్యూల్ ప్రకారం నిన్నే ఎన్నిక జరగాల్సిన ఉన్నా.. ఇవాళ్టికి వాయిదా పడింది.. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అదృశ్యమయ్యారని.. గత అర్థరాత్రి నుంచి అతను కనిపించకుండా పోయారని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని అతని అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం.. కాగా, నేడు మరోసారి తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.. కోరం లేకపోవడంతో నిన్నటి రోజున ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు ఎన్నికల అధికారి… కూటమి వైపు మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా.. డిప్యూటీ మేయర్ పదవిని చేజిక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 25గా ఉంది.. నిన్నటి రోజున ఎన్నికల కేంద్రానికి వస్తున్న వైసీపీ కార్పొరేటర్లలో నలుగురు అదృశ్యం… టీడీపీ నేతలు.. నలుగురు వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి.. అయితే, తాము క్షేమంగానే ఉన్నామని, గొడవలు చూసి భయపడి వచ్చేశామని సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు నలుగురు వైసీపీ కార్పొరేటర్లు..
Read Also: Tollywood : ఆ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పై టాలీవుడ్ నిర్మాతల గరం గరం
మరోవైపు, తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ నిన్న మధ్యాహ్నం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అదృశ్యమైన నలుగురు కార్పొరేటర్ లను భారీ భద్రత నడుమ ఎన్నికల కేంద్రానికి తీసుకురావాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు.. నలుగురు కార్పొరేటర్లు ఇవాళ ఎన్నికకు హాజరు కావడంపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.. ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుండగా.. డిప్యూటీ మేయర్ పీఠం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి కూటమి పార్టీలు.. ఈ నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
Read Also: MLC Sipai Subramanyam: వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్..! వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ సిపాయి..
Viral Video: బాయ్‌ఫ్రెండ్ విషయంలో రోడ్డుపై గొడవపడ్డ స్కూల్ విద్యార్థినులు
- బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలో ఆసక్తికరమైన ఘటన
- అబ్బాయిపై ప్రేమ పెంచుకున్న ఇద్దరు స్కూల్ విద్యార్థినులు తన బాయ్ ఫ్రెండ్ కోసం బహిరంగంగా గొడవ.
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటోలు , వీడియోలు.

Viral Video: బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ అబ్బాయిపై ప్రేమ పెంచుకున్న ఇద్దరు స్కూల్ విద్యార్థినులు తన బాయ్ ఫ్రెండ్ కోసం బహిరంగంగా గొడవకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్నియాలోని గులాబ్‌బాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఒకే అబ్బాయితో రెండు విద్యార్థినులు ప్రేమలో ఉన్నారు. ఈ విషయం ఒకరికి తెలియడంతో ఇద్దరూ ముందుగా వాగ్వాదానికి దిగారు.
గొడవ జరగక ముందు ఇద్దరూ తమ సహచరులను తీసుకుని రోడ్డుపై వచ్చారు. తొలుత మాటల యుద్ధంగా మొదలైన ఈ గొడవ, కొంతసేపటికి హింసాత్మకంగా మారింది. స్కూల్ యూనిఫామ్‌లోనే ఉన్న విద్యార్థినులు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకోవడం, జుట్టును పట్టుకొని లాగడం మొదలుపెట్టారు. ఈ గొడవ బహిరంగంగా రోడ్డుపై బహిరంగంగా జరగడంతో అక్కడి వారి ఆశ్చర్యపోయారు. చాలామంది విద్యార్థినులు ఈ ఘర్షణలో పాల్గొన్నారు. ఇది చూసిన స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థినులను శాంతింపజేశారు. దీంతో గొడవ అదుపులోకి వచ్చింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఘటనపై మరింత చర్చ మొదలైంది.
ఈ ఘటన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదర్ పోలీస్‌స్టేషన్ అధికారి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. స్కూల్ విద్యార్థినుల మధ్య జరిగిన ఈ ఘర్షణపై విచారణ జరుగుతోందని తెలిపారు. అయితే, ఈ గేట్ కు సంబంధించి కేసు నమోదు చేయకపోయినా, సంబంధిత వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని హెచ్చరించారని తెలిపారు. మొత్తానికి ఈ ఘటన యువత నడవాల్సిన దారిని ప్రతిబింబించేలా ఉంది. పాఠశాలలో చదువుకునే వయసులో ఉన్న విద్యార్థినులు ఇలా మార్పు చేయడం ఆందోళన కలిగించే అంశం. ఇది కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా విద్యా సంస్థలు, సమాజం కూడా చర్చించాల్సిన సమస్య.