Corn silk: మొక్కజొన్న పీచుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Corn silk: మొక్కజొన్న పీచుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Corn silk: మొక్కజొన్న పీచుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. వాతావరణాన్ని బట్టి కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ఇష్టపడుతూ ఉంటాం. వాన కాలంలో, చలికాలం అయితే వేడి వేడి గా ఏదైనా తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు. అలాంటి వాటిలో మొక్కజొన్న పొత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మొక్కజొన్న ఇష్టపడని వారుండరు వీటిని నిప్పులపై కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఈ మొక్కజొన్న లో చాలా లాభాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే చాలా వరకు మొక్కజొన్నను వలిచిన తర్వాత చెత్తగా భావించి దాని పీచును బయట పడేస్తుంటారు. కని పారేసే ఆ పీచులో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

* మొక్కజొన్న పీచు లో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి2, సి, కె వంటి పోషకాలు ఉంటాయి. కనుక దీన్ని 5000 సంవత్సరాల క్రితం అనేక అనారోగ్యాల చికిత్సలో దీన్ని వాడేవారు. అంతేకాదు మొక్కజొన్న పీచులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు యూరినరీ ట్రాక్‌‌ ఇన్ఫెక్షన్‌, మూత్రంలో మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే యూరిన్‌లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మన శరీరంలో ఉన్న అదనపు నీరు, వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.

* మొక్కజొన్న పీచు ఉడికించి నీటిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీని వల్ల కిడ్నీలో ఉండే నైట్రేట్లు, టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎవరికైనా కిడ్నీలో రాళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటే, మొక్కజొన్న పీచు మరిగించి నీటిని తీసుకోవడం వల్ల ఆ సమస్యను తగ్గించుకోవచ్చు.

* రక్తపోటును నియంత్రించడంలో ఈ మొక్కజొన్న పీచు నుండి తయారు చేసిన నీరు సహాయపడుతుంది. దీని తీసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే మినరల్స్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి.

* బరువు తగ్గాలనుకునే వారు మొక్కజొన్న జుట్టు ఉడికించిన నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని వినియోగం శరీరంలో ఇన్ఫ్లమేషన్, వాటర్ రిటెన్షన్ సమస్యను నయం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్, అదనపు కొవ్వును తగ్గిస్తుంది. అంతే కాదు ఎలాంటి కొవ్వునైన తగ్గించడానికి సహాయపడుతుంది.

* కొంత మందికి శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న కూడా మంటగా అనిపిస్తుంది. అలాంటి వారు మొక్కజొన్న జుట్టు నీరు తీసుకోవాలి. ఇందులొ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల దీని వినియోగం శరీరంలో మంట ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ శరీరంలో మంట కారణంగా, మీరు ఏకకాలంలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగి ఉండవచ్చు. అందుకే రోజూ మొక్కజొన్న పీచు నీటిని తాగితే దాని అదుపు చేయవచ్చు.

*చాలా మందికి ఎంత లైట్ ఫుడ్ తీసుకున్నప్పటికి వారిలో అరుగుదల సరిగా ఉండదు. అలాంటి వారు ఎక్కువగా మధుమేహంతో ఇబ్బంది పడతారు. ఈ మొక్కజొన్న జుట్టు నుంచి వచ్చే నీరు తాగితే మధుమేహం సమస్య తగ్గుతుంది. దీని వినియోగం రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుంది. అలా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

Fighting in Wedding: పెళ్లిలో భోజనం విషయంలో గొడవ.. కర్రలతో దాడి

  • Corn silk: మొక్కజొన్న పీచుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
  • అనంతపురం జిల్లా గుత్తిలో ఓ పెళ్లి వేడుకలో ఘర్షణ..
  • వివాహ వేడుకలో భోజనం వడ్డించే విషయంలో వివాదం..
  • ఒక వర్గం మరో వర్గంపై కర్రలతో దాడి..
Fighting in Wedding: పెళ్లిలో భోజనం విషయంలో గొడవ.. కర్రలతో దాడి

Fighting in Wedding: పెళ్లి వేడుక అంటే అంతా అట్టహాసంగా జరుగుతోంది.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో హుషారుగా సాగుతోంది.. అయితే, భోజనం వడ్డించే విషయంలో చోటు చేసుకున్న చిన్న వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారినట్టు పెద్దది అయ్యింది.. చివరకు రెండు వర్గాలు పరస్పరం కర్రలతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది.. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది.

అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో సోమవారం రాత్రి ఓ వివాహ వేడుకలో భోజనం వడ్డించే విషయంలో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒక వర్గం మరో వర్గంపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘర్షణలో ఓ వర్గానికి చెందిన మాబు, ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. భోజనం వడ్డించే విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. మహమ్మద్ రసూల్, నూర్ భాషా, రెహనాతో పాటు మరో ఇద్దరు మాబు, ఆసిఫ్ పై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో మహబూబ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Medchal Murder Case: మేడ్చల్‌ మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు..

  • మేడ్చల్‌ మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
  • హత్య కేసులో మహిళను గుర్తించిన పోలీసులు
  • నిజామాబాద్ బోధన్ కి చెందిన శివ నందగా గుర్తించిన పోలీసులు.
Medchal Murder Case: మేడ్చల్‌ మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు..

మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌ కల్వర్టు కింద జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో పోలీసులు మహిళను గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కి చెందిన శివ నందగా పోలీసులు గుర్తు పట్టారు. మహిళ శివ నందకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే.. హనుమకొండ జిల్లా కమలాపూర్‌కి చెందిన షేక్ ఇమామ్ అనే వ్యక్తితో కలిసి మేడ్చల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మునీరాబాద్‌లోని ఓ మెడికల్ షాప్‌లో కండోమ్స్ కొన్నట్లు కనుగొన్నారు. అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన ఆ ఇద్దరు.. వారి మధ్య గొడవ జరగడంతోనే మహిళను చంపినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. మహిళను దారుణంగా హత్య చేసిన నిందితుడిని పట్టుకున్నారు. ఈ రోజు ఉదయం మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా.. ఈ నెల 24న మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో ఈ హత్య ఘటన బయటపడింది. మహిళను బండరాళ్లతో కొట్టి హత్య అనంతరం.. పోలీసులకు క్లూస్‌ దొరక్కుండా ఉండేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు నిందితుడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మని అని యువతి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో నరేందర్ అని ఇంగ్లీష్‌లో టాటూ ఉన్నట్లు క్లూస్ టీమ్స్ గుర్తించారు. తాజాగా.. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఛేదించారు.

Meerpet Murder Case: పక్కా ప్రణాళిక ప్రకారం హత్య.. సీపీ సంచలన విషయాలు

  • Corn silk: మొక్కజొన్న పీచుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
  • మీర్‌పేట్‌ హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ
  • అంతకముందు గురుమూర్తి ఇంట్లో, మీర్‌పేట్‌ పెద్ద చెరువు వద్ద సీన్ రీ-కన్‌స్ట్రక్షన్
  • భార్య వెంకట మాధవిని కిరాతంగా హత్య చేసిన గురుమూర్తి అరెస్ట్.

తెలుగు రాష్ట్రాల్లో మీర్‌పేట్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. కాగా భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిన్న పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన విషయాలు మీడియాకు తెలిపారు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవి గురుమూర్తిల మధ్య గొడవ స్టార్ట్ అయిందని అన్నారు. గొడవ కావడంతో మాధవిని చంపాలని గురుమూర్తి అనుకున్నాడు.. అందుకోసమే ఆమెని కొట్టాడని సీపీ వెల్లడించారు. ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయింది.. వెంటనే ఆమె స్పృహ కోల్పోయినా, ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఆమె గొంతు పిసికి చంపాడని తెలిపారు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాడు.. ఆ తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించాడు.. మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళాడు.. కిచెన్‌లో నుండి కత్తి తీసుకొని వచ్చాడని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

మొదట మాధవి భుజాలను కట్ చేశాడు.. డెడ్ బాడీ నుండి చేతులను వేరు చేశాడు.. ఆ తర్వాత డెడ్ బాడీ నుండి కాళ్లను కూడా వేరు చేశాడు.. కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా చేశాడు.. ముక్కలుగా చేసిన కాళ్లు చేతుల భాగాలను బకెట్లో వేశాడని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఆ తర్వాత బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు.. ఆ తర్వాత శరీర భాగాలను అందులో వేసి ఉడికించాడు.. ఆ తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై ఉంచాడన్నారు. అనంతరం ఎముకలను రోటిలో దంచి పౌడర్ చేశాడు.. ఆ పౌడర్‌ను బాత్రూంలోకి వెళ్లి అనేక సార్లు ఫ్లెష్ చేశాడు.. మరికొన్ని చిన్నచిన్న ఎముకలను డస్ట్ బిన్ లో ఉంచాడని సీపీ వెల్లడించారు. నిందితుడు గురుమూర్తి కిచెన్ డోర్, ఇంట్లో, కిటికీలు తలుపులు తెరిచి ఉంచే ఇదంతా చేశాడని అన్నారు. సుమారు 8 గంటల పాటు బాడీని మొత్తం ముక్కలుగా చేసి పౌడర్ గా చేశాడు.. డిటర్జెంతో పాటు ఫినాయిల్ ఉపయోగించి ఎవిడెన్స్ లేకుండా చేశాడని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.

ఈ ఘటనలో మొత్తం 16 వస్తువులను సీజ్ చేశామని రాచకొండ సీపీ చెప్పారు. గురుమూర్తికి ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని సీపీ తెలిపారు. నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు.. ప్రకాశం జిల్లాకి చెందిన గురుమూర్తి.. వెంకట మాధవి జిల్లెలగూడలో ఉంటున్నారని అన్నారు. భార్యను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే.. ముందస్తుగా తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచి వచ్చాడని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే భార్య మాధవి తో గొడవ పెట్టుకున్నాడు.. వెంకట మాధవిని కొట్టాడు.. గోడకు వేసి అదిమాడు.. మాధవి పైన కూర్చుని గొంతు నులిమాడు.. ఊపిరి ఆగిపోయేంత వరకు గొంతు నులిమాడని సీపీ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. మాధవిని హత్య చేసి బూడిద చేసి చెరువులో పారేసిన తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాడని సీపీ చెప్పారు. పిల్లలకు తల్లిపై లేనిపోని మాటలు చెప్పాడు.. మీ మమ్మీ నాతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు.. అత్త, మామలకు కూడా ఇదే విషయం చెప్పాడన్నారు. గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు.. ఆధారాలు దొరికిన తర్వాత కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. మాధవిని పక్కా ప్రణాళిక ప్రకారం గురుమూర్తి హత్య చేశాడు.. క్షణికావేశంలో చేసిన హత్య కాదన్నారు. నిందితుడు గురుమూర్తిని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం.. ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుస్తాయని సీపీ చెప్పారు.

Read More….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top