- DIgital Media: డిజిటల్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు!
- డిజిటల్ మీడియా జర్నలిస్ట్‌లకు శుభవార్త
- ఆక్రిడిటేషన్‌లు ఇచ్చేందుకు గైడ్‌లైన్స్
- డిజిటల్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు

ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్‌లైన్ న్యూస్ మీడియా (వెబ్‌సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్‌కు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్ విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ వారు లేఖ అందించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఐ అండ్ పీఆర్ కమిషనర్ త్వరలోనే ఆన్‌లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని కమిషనర్ ఎస్ హరీష్ తెలిపారు.
జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు స్వామి ముద్దం మాట్లాడుతూ… ‘ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మీడియా రంగం కీలక పాత్ర వహిస్తుంది. డిజిటల్ మీడియాలో అనేక మంది జర్నలిస్టులు పని చేస్తున్నారు. ఆన్‌లైన్ న్యూస్ మీడియాకు గుర్తింపును ఇస్తూ ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి సహకరించాలని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశాం. ఇందుకు సానుకూలంగా స్పందించి.. ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడం సంతోషకరమైన విషయం. జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆన్‌లైన్ న్యూస్ మీడియాకు తెలంగాణ మీడియా ఆకాడమీ ఆక్రిడిటేషన్‌లు ఇచ్చేందుకు గైడ్‌లైన్స్ రూపొందంచడం కొత్త మీడియా జర్నలిస్టులకు శుభపరిణామం’ అని అన్నారు.
Table of Contents
TS Inter Hall Ticket: విద్యార్థుల మొబైల్‌లకే ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు!

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల మొబైల్‌లకే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు రానున్నాయి. విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు ఇంటర్ బోర్డు అధికారులు లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే హాల్‌టికెట్ వస్తుందని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. గతంలో కళాశాలలకే హాల్‌టికెట్లను పంపేవారు. విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి హాల్‌టికెట్లను తీసుకునేవారు.
నేటి (జనవరి 30) నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే విద్యార్థుల మొబైల్‌లకు పంపించామని ఇంటర్ బోర్డు అధికారి తెలిపారు. రెండవ సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయని, త్వరలో హాల్‌టికెట్లను పంపిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు.