- మహారాష్ట్రలోని పూణేలో గిలియన్ బేర్ సిండ్రోమ్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్‌తో ఇటీవల ఓ బాలుడి మృతిచెందడంతో సహా మరో నలుగురు చనిపోయారు. ప్రస్తుతం జీబీఎస్ సిండ్రోమ్ అందరినీ బెంబేలెత్తిస్తుంది.

ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి దేశం బయటపడుతుంటే, గులియన్ బారే సిండ్రోమ్ (GBS) వైరస్ కొత్తగా భయాందోళనలు రేపుతోంది. తొలుత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన ఈ వ్యాధి ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఊహించిన దానికంటే వేగంగా వ్యాపించి, మరణ మృదంగం మోగిస్తోంది.
మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 163 మంది ఈ వైరస్ బారినపడగా, ఒక్క పుణే జిల్లాలోనే 149 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా, నాందేడ్‌లో జీబీఎస్ బారినపడి చికిత్స పొందుతున్న 60 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. దీంతో రాష్ట్రంలో జీబీఎస్ వల్ల మరణించిన వారి సంఖ్య 5కి చేరింది.
మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం కొత్తగా ఐదుగురికి జీబీఎస్ నిర్ధారణ అయ్యింది, అయితే ఎటువంటి మరణం నమోదు కాలేదు. ఇప్పటి వరకు 127 మంది జీబీఎస్‌తో బాధపడుతుండగా, 163 మంది అనుమానిత కేసులుగా గుర్తించారు.
పుణే నగరంలో 32, పుణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల చేరిన గ్రామాల్లో 86, పింప్రి చించివాడలో 18, పుణే గ్రామీణ జిల్లాలో 19, ఇతర జిల్లాల్లో 8 మంది బాధితులు ఉన్నారు. GBS బారినపడిన వారిలో ఇప్పటివరకు 47 మంది పూర్తిగా కోలుకున్నారు.
OTT: ప్రతి రోజు ఒక కల.. చిన్నపిల్లలే టార్గెట్! ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ చూసి ఉండరు
సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఏ ఎడి ఇన్ఫినిటమ్” అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. యుగంధర్ ముని దర్శకత్వంలో, నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటించారు.

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు వెబ్ సిరీస్ లకు ప్రస్తుతం బాగా డిమాండ్ ఉంది. సినీ ప్రేమికులు కూడా ఈ తరహా సినిమాలను వెబ్ సిరీస్ లను ఎక్కువగా ఇష్టపడడంతో పాటు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వెబ్ సిరీస్ లు సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే తరహాలో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఒక మూవీ భారీ ట్విస్టులతో అదరగొడుతోంది. ఇంతకీ ఆ మూవీ పేరు ఏమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అసలు కథ ఏమిటి అన్న విషయానికి వస్తే.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏ ఎడి ఇన్ఫినిటమ్.
అవంతిక ప్రొడక్షన్స్ బ్యానరులో గీతా మింసాల నిర్మించారు. ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని, బేబీ దీవేన, కృష్ణవేణి, భరద్వాజ్ తదితరులు నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే కథలోకి వెళ్తే.. సంజీవ్ రోడ్డు మీద దెబ్బలతో పడి ఉంటాడు. తర్వాత హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సంజీవ్ గతం మరిచిపోయి ఉంటాడు. ఈ నేపథ్యంలోనే సంజీవ్ ని చూసుకుంటూ పల్లవి అనే ఆమె నర్స్ గా చేస్తూ ఉంటుంది. అలా వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వీరిద్దరూ కూడా ఒకటే హాస్పిటల్లో పని చేస్తుంటారు.