- Google Identity Check Feature: అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్.. ఫోన్ దొంగిలించినా ఓపెన్ చేయలేరు!
- గూగుల్ అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్
- గూగుల్ ఐడెంటిటీ చెక్ ఫీచర్
- ఈ సెక్యూరిటీ ఫీచర్ తో ఫోన్ దొంగిలించిన ఓపెన్ చేయలేరు

స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. కాల్స్ నుంచి మొదలుకుని బ్యాంక్ పనుల వరకు మొబైల్ కీలకంగా మారింది. అందుకే ఫోన్ ను చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తుంటారు. ఫోన్ లో ఫోటోలు, వీడియోలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ను కూడా స్టోర్ చేసుకుంటుంటారు. అయితే ఎప్పుడైనా ఫోన్ పోగొట్టుకుంటే మీ డేటా అంతా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ అద్భుతమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే గూగుల్ ఐడెంటిటీ చెక్ ఫీచర్. ఈ సెక్యూరిటీ ఫీచర్ తో ఫోన్ దొంగిలించిన వ్యక్తి తలపట్టుకుకోవడం ఖాయం. ఎందుకంటే ఫోన్ ను ఓపెన్ చేయలేరు. మీ ఫోన్ లో ఉన్న డేటా సురక్షితంగా ఉంటుంది.
గూగుల్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ లో కొన్ని లొకేషన్లను యాడ్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా వేరే ప్రాంతాల్లో ఫోన్ ఓపెన్ చేయాలంటే కచ్చితంగా ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఫోన్ పిన్ ఇతరులకు తెలిసినా ఓపెన్ కాదని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ ముందుగా గూగుల్ పిక్సెల్, సామ్ సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ లకు అందుబాటులో ఉండనున్నది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత గూగుల్ పిక్సెల్ ఫోన్ లో పనిచేస్తుంది. ఈ ఫీచర్ అల్ట్రాసోనిక్, ఆప్టికల్ ఇన్ డిస్ల్పే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3డీ ఫేస్ రికగ్నిషన్ ఉన్న పరికరాలకు మాత్రమే సపోర్ట్ చేస్తుందని గూగుల్ తెలిపింది. అయితే 72 గంటల తర్వాత పిన్, పాస్ కోడ్ తో మొబైల్ యాక్సెస్ చేయొచ్చని తెలిపింది.
ఐడెంటిటీ చెక్ ఫీచర్‌ని ఎలా ఆన్ చేయాలంటే?
మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి.
సెట్టింగ్‌లలో సెక్యూరిటీ & ప్రైవసీ లేదా బయోమెట్రిక్ & పాస్‌వర్డ్ ఎంపికపై క్లిక్ చేయాలి.
క్రిందికి స్క్రోల్ చేసి, ఐడెంటిటీ చెక్ ఫీచర్‌ని ఎంచుకోవాలి.
ఫీచర్‌ని ఆన్ చేయడానికి ముందు మీ మొబైల్ లో ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్ బయోమెట్రిక్ సెట్ చేసుకోవాలి.
లొకేషన్లను యాడ్ చేసుకోవాలి.
Whatsapp View Once: వాట్సాప్ యూజర్లకు షాక్.. ‘View Once’ ఫీచర్‌లో పెద్ద లోపం..
- అందుబాటులో అనేక వాట్సాప్ ఫీచర్లు.
- తాజాగా బయటపడ్డ “వ్యూ వన్స్” ఫీచర్ లోని లోపం.
- సమస్యను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్న మెటా కంపెనీ.

Whatsapp View Once: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. అందులో “వ్యూ వన్స్” (View Once) ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. ఈ ఫీచర్ ద్వారా ఫొటోలు, వీడియోలు లేదా వాయిస్ మెసేజ్‌లను పంపితే అవి అవతలి వ్యక్తి ఒకసారి చూసిన తర్వాత పూర్తిగా డిలీట్ అవుతాయి. ఇది వ్యక్తిగత ఫైల్స్, ప్రైవేట్ సమాచారం పంపించడానికి అనేకమంది ఉపయోగిస్తారు. అయితే, ఈ ఫీచర్‌లో ఓ పెద్ద లొసుగు ఉండడంతో యూజర్ల ప్రైవసీకి ప్రమాదం కలుగుతోంది.
వాట్సాప్ ప్రకారం, “వ్యూ వన్స్” ఫీచర్‌లో పంపిన మీడియాను అవతలి వ్యక్తి ఒకసారి చూసిన తర్వాత అది తిరిగి కనిపించదు. కానీ, ప్రస్తుతం ఐఫోన్‌లలో ఓ లొసుగును ఉపయోగించి, “వ్యూ వన్స్” మీడియాను మళ్లీ చూడగలిగే అవకాశం ఉంది. ఈ లొసుగుతో ఈ ఫీచర్ ఉద్దేశం పూర్తిగా విఫలమవుతోంది. ఐఫోన్ యూజర్లు ఈ క్రింది పద్ధతిని అనుసరించి “వ్యూ వన్స్” మీడియాను మళ్లీ చూడవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేసి Settings > Storage and Data > Manage Storage వెళ్లాలి. అక్కడ చూపబడే కాంటాక్ట్‌ల జాబితాలో మీకు అవసరమైన వ్యక్తి పేరు ఎంచుకోండి. Sort By > Newest First ఆప్షన్ ఎంచుకుంటే “View Once” మీడియా పునరుద్ధరించబడుతుంది. దాంతో, మళ్లీ ఆ ఫోటో లేదా వీడియోను చూడగలుగుతారు. ఈ లొసుగుతో “వ్యూ వన్స్” మీడియా నిజంగా ఒకసారి మాత్రమే కనిపిస్తుందన్న నమ్మకం దెబ్బతింటోంది. వ్యక్తిగతంగా, రహస్యంగా భావించిన సమాచారాన్ని పంపేవారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఈ ఫీచర్‌లో ఉన్న లోపం కారణంగా వ్యక్తిగత లేదా కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని పంపే యూజర్ల ప్రైవసీ ప్రమాదంలో పడుతుంది. ప్రైవేట్ ఫొటోలు లేదా వీడియోలు ఒకసారి చూసి మాయం అవుతాయని అనుకున్నా, అవతలి వ్యక్తి వాటిని మళ్లీ చూడగలగడం షాకింగ్ అని చెప్పాలి. వాట్సాప్‌ను నిర్వహిస్తున్న మెటా కంపెనీ ఈ సమస్యను సరిదిద్దేందుకు పనిచేస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు ఈ సమస్యకు అప్డేట్ రాకముందు యూజర్లు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారం లేదా రహస్యమైన కంటెంట్‌ను “వ్యూ వన్స్” ఫీచర్ ద్వారా పంపే ముందు దీనిపై ఆలోచించడం మంచిది.
Samsung Smart TV: ఇది కదా డీల్ అంటే?.. 43 అంగుళాల సామ్ సంగ్ టీవీపై రూ. 20 వేల డిస్కౌంట్
- 43 అంగుళాల సామ్ సంగ్ టీవీపై రూ. 20 వేల డిస్కౌంట్
- అమెజాన్ లో 39 శాతం తగ్గింపు ప్రకటించింది
- మతిపోయే ఫీచర్లు

సాధారణ టీవీలు దాదాపు కనుమరుగై పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ టీవీలదే హవా. ఆండ్రాయిడ్ యాప్స్, లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. చిన్నదో, పెద్దదో మొత్తానికి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండాలని ఫిక్స్ అవుతున్నారు జనాలు. టీవీ తయారీ కంపెనీలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అంతే కాదు పండగలు, ప్రత్యేక సేల్స్ సందర్భంగా కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 43 అంగుళాల సామ్ సంగ్ టీవీపై రూ. 20 వేల డిస్కౌంట్ అందిస్తోంది.
Samsung 108 cm (43 inches) Full HD Smart LED TV UA43T5450AKXXL (Black)పై అమెజాన్ లో 39 శాతం తగ్గింపు ప్రకటించింది. ఈ టీవీ అసలు ధర రూ. 40,400గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 24,490కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే వచ్చేస్తోంది. బ్రాండెడ్ టీవీపై ఇంతకంటే మంచి డీల్ ఉండదేమో. కొత్త టీవీ కొనాలనుకునే వారు ఈ స్మార్ట్ టీవీపై ఓ లుక్కేయండి.
Samsung (43 inches) Full HD Smart LED TV ఫీచర్ల విషయానికి వస్తే.. 43 అంగుళాల స్క్రీన్ సైజ్ తో వస్తుంది. LED డిస్ప్లే టెక్నాలజీ అందించారు. రిజల్యూషన్ 1080p, రిఫ్రెష్ రేట్ 50 Hzతో వస్తుంది. ఇందులోని స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే.. ఫుల్ HD రిజల్యూషన్, పర్ కలర్, ఒక రిమోట్ ఫంక్షన్. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జీ5, జియో సినిమా వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ టెక్నాలజీ RF, Wi-Fi, USB, ఈథర్నెట్, HDMI అందించారు. ల్యాప్‌టాప్/PCలు/గేమింగ్ కన్సోల్/హోమ్ థియేటర్ లతో కనెక్ట్ చేసుకోవచ్చు. 20 వాట్స్ పవర్ ఫుల్ అవుట్ పుట్ సౌండ్ ను ఇస్తుంది. పవర్ ఫుల్ స్పీకర్స్ ను అందించారు. వెబ్ బ్రౌజర్, వైఫై డైరెక్ట్, స్మార్ట్‌థింగ్స్, స్క్రీన్ మిర్రరింగ్, గేమ్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లు కలిగి ఉంది.