Infinix Smart 9 HD: ఇన్‌ఫినిక్స్‌ నుంచి మరో కొత్త ఫోన్.. రూ.6,699 మాత్రమే!

Infinix Smart 9 HD: ఇన్‌ఫినిక్స్‌ నుంచి మరో కొత్త ఫోన్.. రూ.6,699 మాత్రమే!

  • ఇన్‌ఫినిక్స్‌ నుంచి మరో కొత్త ఫోన్
  • ధర రూ.6,699 మాత్రమే
  • ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్‌ ప్రారంభం
Infinix Smart 9 HD: ఇన్‌ఫినిక్స్‌ నుంచి మరో కొత్త ఫోన్.. రూ.6,699 మాత్రమే!

న్యూ ఇయర్ ఆరంభంలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లు మొబైల్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మొబైల్స్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మరో మొబైల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ ఫినిక్స్ 7 వేల కంటే తక్కువ ధరలో ఇన్ ఫినిక్స్ స్మార్ట్ 9హెచ్డీ ఫోన్ ను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. దీని ధర రూ.6,699 మాత్రమే. చౌక ధరలో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Infinix Smart 9 HD ఫోన్ మింట్ గ్రీన్‌, కోరల్‌ గోల్డ్‌, నియో టైటానియం, మెటాలిక్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఇది 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 6.7 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్‌ తో వస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, DTS ఆడియో ప్రాసెసింగ్ ఉన్నాయి. స్మార్ట్ 9 హెచ్‌డి IP54 రేటింగ్‌తో వస్తుంది. ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 9 హెచ్‌డీ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హెలియో జీ50 ప్రాసెసర్‌ విత్‌ 2.2 హెర్ట్జ్‌ పీక్‌ క్లాక్‌ స్పీడ్‌తో వస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్‌ ప్రారంభం కానుంది.

6GB RAM (3GB ఫిజికల్ + 3GB వర్చువల్), 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు విస్తరించవచ్చు. ఫోటోగ్రఫీ కోసం, Infinix Smart 9 HD క్వాడ్ LED, జూమ్ ఫ్లాష్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఫోన్ 5,000mAh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 14.5 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 8.6 గంటల గేమింగ్‌ను అందించగలదని కంపెనీ తెలిపింది. Infinix Smart 9 HDలో Wi-Fi, బ్లూటూత్, USB టైప్-C, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.

ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ రిలీజ్ అయింది. ఈ ఫోన్ ను తొలి రోజు కొనుగోలు చేస్తే రూ. 6,199 లకే సొంతం చేసుకోవచ్చని కంపెనీ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తున్నవారు దీన్ని పరిశీలించవచ్చు.

Infinix Smart 9 HD

Representative Imageఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి మరొ కొత్త స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్లో లాంఛ్ అయింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ మోడల్ ను కంపెనీ ఈరోజు విడుదల చేసింది. 2023 డిసెంబర్ లో వచ్చిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీకి కొనసాగింపుగా కంపెనీ ఈ ఫోన్ ను తీసుకొచ్చింది. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ధర రూ. 6,699 గా ఉంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభ అవుతాయి. తొలి రోజు ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే డిస్కౌంట్ లో రూ. 6,199 లకే లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇన్ఫినిక్స్ వెబ్ సైట్ తో పాటు, ప్లిప్ కార్ట్ లో ఈ ఫోన్లు లభిస్తాయి. బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ కొత్త 4జీ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ ఫీచర్లు
డ్యుయల్ నానో సిమ్

6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే

స్క్రీన్ రిజొల్యూషన్ 720X1600 పిక్సెల్

మీడియాటెక్ హీలియో జీ50 ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఎక్స్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టం

ర్యామ్ 3 జీబీ, స్టోరేజీ 64 జీబీ. 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

వెనుకపైపు రెండు కెమెరాలుంటాయి. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు క్వాడ్ ఎల్ఈడీ ప్లస్ జూమ్ ప్లాష్ కెమెరా ఉంటుంది.

ముందువైపు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమరా ఉంటుంది.

బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ గా ఉంది.

ఈ ఫోన్ మింట్ గ్రీన్, కోరల్ క్లౌడ్, మెటాలిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

ఫోన్ బరువు 188 గ్రాములు

వైఫై 5, మొబైల్ హాట్ స్పాట్, బ్లూట్, జీపీఎస్ ఉంటాయి.

యూఎస్బీ 2.0 కనెక్టివిటీ ఉంటుంది.

డీటీఎస్ సౌండ్ ఆడియో ఫీచర్ ఉంటుంది.

సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

ఈ ఫోన్ 5కీ సపోర్ట్ చేయదు.

బడ్జెట్ ధరలో కొత్మ స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీని పరీశిలించవచ్చు. అయితే ఇది 4జీ ఫోన్. 5జీ ఫోన్ కోసం చూస్తున్నవారికి సూట్ కాదు. 2జీ ఫోన్ల నుంచి 4జీకి అప్ గ్రేడ్ కావాలనుకునేవారికి ఈ ఫోన్ బాగానే ఉంటుంది.

Read More…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top