TPCC Chief: హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయము!

  • TPCC Chief: హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయము!
  • కాంగ్రెస్ ప్రభుత్వం జనాలను మోసం చెయ్యదు
  • జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నాము
  • ఫిబ్రవరి రెండో వారంలో రాహుల్ గాంధీ సభ
TPCC Chief: హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయము!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని, మేయర్ పీఠం గెలుచుకుంటామని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.

పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ… ‘జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నాం. మేయర్ పీఠం గెలుచుకోవాలని ప్లానింగ్ చేశాం. కేంద్రం నుండి రూపాయి నిధులు ఇవ్వలేని ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ సమావేశంకి బీజేపీ వాళ్లు బిక్షాటన చేస్తూ రావడం విడ్డూరంగా ఉంది. కుల సర్వే జరిగితే బీఆర్ఎస్, బీజేపీలు తమకు నష్టం జరుగుతుందని అనేక కుట్రలు చేశాయి. ఫిబ్రవరి 5న ఉప సంఘం కేబినెట్ నివేదిక ఇస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కేబినెట్‌లో నిర్ణయిస్తారు’ అని చెప్పారు.

‘స్పీకర్ ఉద్దేశం డబ్బులు లేవని కాదు. అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుంది. హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయడం అంటూ ఉండదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరుపై ఇప్పటికే కసరత్తు జరిగింది. ఢిల్లీకి పేర్లు పంపించాము. ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుంది. సమయాన్ని బట్టి సీఎం ఇంటి దగ్గర సమీక్ష చేస్తారు, అందులో తప్పేంటి?. సచివాలయం కూల్చి మరలా కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. ఫిబ్రవరి రెండో వారంలో సూర్యాపేట జిల్లాలో రాహుల్ గాంధీ సభ ఉంటుంది. పటాన్ చెరుపై కమిటీ నివేదిక ఇంకా రాలేదు. ఎమ్మెల్యే కమిటీ ముందుకు రావాల్సి ఉంది. సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం జరుగుతుంది’ అని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.

Also Read…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top