WhatsApp Governance: ప్రజలకు అందుబాటులో

WhatsApp Governance: ప్రజలకు అందుబాటులో

WhatsApp Governance: ప్రజలకు అందుబాటులో WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక అడుగులు వేస్తోంది.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది.. ఏపీ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చింది.. ప్రజలకు మొదటి దశలో 161 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి.. రెవెన్యూ, దేవాదాయ శాఖ, సీఎంఆర్ఎఫ్.. ఇలా మొత్తంగా “మన మిత్ర” ద్వారా 161 రకాల సేవలను పౌరులకు అందుబాటులో ఉంటాయని.. వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు.. రెండో దశలో 300 పైగా పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి.. ఇక ఏపీ ప్రభుత్వం దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009ను కేటాయించింది. దీని ద్వారా వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందించనుంది.. ఒకేముందు.. 95523 00009ను సేవ్‌ చేసుకోండి..

Read Also: Jio Recharge Offer: త్వరపడండి.. 200 రోజులకు 500GB డేటా

ఇక, వాట్సాప్‌ సేవలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పరిపాలన సంస్కరణల్లో ఇది ఒక చారిత్రాత్మక రోజు. “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తున్నాం. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్‌తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు. యువగళం పాదయాత్రలో నే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన వచ్చిందన్నారు.. బటన్ నొక్కితే భోజనం, సినిమా వచ్చినపుడు.. పాలన ఎందుకు రాకూడదు..? ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలనేది మా ఉద్దేశం అన్నారు.. ఊరు నుంచి ఇంకో ఊరు పాదయాత్రలో వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ ల కోసం మమ్మల్ని తిప్పద్దు అని చాలా మంది అడిగారు.. గత ఐదేళ్లలో సర్టిఫికెట్ కుడి కొన్ని సందర్భాల్లో రాలేదు. దుగ్గిరాల మండలం లో ఎంపీటీసీ పోటీ చేస్తే గత ప్రభుత్వం బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు.. సర్టిఫికెట్ కోసం ఎవ్వరు ఇబ్బంది పడకూడదు అనేది మా ఉద్దేశమని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..

Also Read…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top